బాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లో పాపులారిటీ తెచ్చుకున్న హాట్ బ్యూటీ వాణీ కపూర్. ఎనిమిదేళ్ళ క్రితం బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు .. ఇప్పటి వరకూ కేవలం నాలుగు సినిమాల్లోనే కనిపించింది. హాట్ నెస్ విత్ బోల్డ్ నెస్ అమ్మడి ప్రత్యేకతలు. అలాగే. పెర్ఫార్మెన్స్ లో కూడా వాణీ ది బెస్ట్ అనిపించుకుంది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాణీ కపూర్.. అక్కడే టూరిజమ్ స్టడీస్ లో డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లోనూ, ఆ పై ఐయల్టీడీ హోటల్స్ లో నూ ఇంటర్న్ షిప్ చేసింది. ఆపై ఇలైట్ హోటల్ మేనేజ్ మెంట్స్ లో మోడలింగ్ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేసింది. ఆ తర్వాత అమ్మడి ప్రయాణం బాలీవుడ్ వైపుగా సాగింది.
శుద్ధ్ దేశీ రొమాన్స్ తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బేఫికర్ లో నటించింది. ఆహా కళ్యాణం తమిళ సినిమాలోనూ కథానాయిక అవతారమెత్తింది. రీసెంట్ గా వార్ మూవీతో బోలెడంత క్రేజ్ తెచ్చుకుంది. అందులోని వాణీ నటనకి, హాట్ నెస్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం బెల్ బాటమ్, షంషేరా, చండీఘర కరే ఆషీఖీ లాంటి సినిమాల్లో నటించి విడుదల కోసం ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం క్రేజీ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న వాణీ కపూర్ .. మరో వైపు సోషల్ మీడియాపై తన హాట్ ఫోటోస్ తో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వేదికగా బికినీలో దర్శనమిచ్చి.. ఒడ్డున తన అందాల్ని నిండుగా వడ్డిస్తోంది. అందులో అమ్మడి హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటున్నారు నెటిజెన్స్ . ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Must Read ;- బికినీ షో తో రెచ్చగోడుతోన్న బాలీవుడ్ బ్యూటీ