అదేం చిత్రమో కానీ.. కొందరికి స్టార్ డమ్ లేకపోయినా.. చేతినిండా సినిమాలుంటాయి. ముఖ్యంగా కొందరు కథానాయికలు ఈ తరహాలోనే కెరీర్ ను లాగించేస్తూంటారు. అలాంటి హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉన్న భామ.. రెజీనా కసాండ్రా. హీరోయిన్ గా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. తమిళ, తెలుగు సినిమాల్లో గ్లామరస్ గా మెరిసింది. అభినయంతోనూ మెప్పించింది. అయితేనేం? కథానాయికగా సరైన గుర్తింపులేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటోంది.

మదర్ టంగ్ తమిళ్ అయినప్పటికీ.. టాలీవుడ్ లో కథానాయికగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంది రెజీనా. బోల్డ్ పాత్రలు చేయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. నిర్మొహమాటంగా గ్లామర్ పండిస్తూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళింది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో నటిస్తూ .. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ‘మిస్టర్ చంద్రమౌళి, నక్షత్రం’ లాంటి సినిమాల్లో రెజీనా తనలోని గ్లామర్ యాంగిల్ ను బైటికి తీసింది. అయినా సరే ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ బ్రేకే రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రెజీనా చేతిలో ఇప్పుడు అరడజన్ కన్నా ఎక్కువ సినిమాలున్నాయి.

ప్రస్తుతం రెజీనా నాలుగు తమిళ చిత్రాలు, రెండు తెలుగు సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఇవి పక్కనపెడితే.. మెగాస్టార్ ఆచార్య సినిమాలో అమ్మడు ఐటెమ్ సాంగ్ లో నర్తించింది. తెలుగులో ‘నేనేనా, మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ రీమేక్ మూవీస్ ను లైన్ లో పెట్టుకున్న రెజీనా.. ‘పార్టీ, కళ్ళపార్ట్, కసాడా తపారా, సూర్ఫణగై’ లాంటి తమిళ సినిమాల్ని కూడా ఆర్డర్ లో పెట్టుకుంది. మొత్తం మీద రెజినా కసాండ్రా.. ఏడు సినిమాలతో సత్తా చాటుకుంటోంది. వీటితోనైనా.. ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి.
Must Read ;- అందమంతా ఈ సుందరి చీరకట్టులోనే ఉన్నది!












