ముంబై వాసి అయినప్పటికీ సౌత్ సినిమాల్లో తన అందాలతో మెప్పించింది పూనమ్ బజ్వా. తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం గ్లామర్ ను ఒలికించి.. కథానాయికగా నిలబడాలని తాపత్రయ పడింది. అయితే అమ్మడికి ఆశించిన రీతిలో ఎక్కడా కూడా గుర్తింపు రాలేదనే చెప్పాలి. యన్టీఆర్ కథానాయకుడు సినిమాలో లోకేశ్వరి పాత్ర పోషించి బాగానే మెప్పించింది. అయినప్పటికీ ఆ సినిమాలో ఆమె ప్రయత్నం వృధా అయింది.
ప్రస్తుతం ఓ తమిళ సినిమాలోనూ, ఓ మలయాళ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తోంది పూనమ్ బజ్వా. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంది ఈ సుందరి. తరచుగా తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. హాట్ నెస్ అండ్ బోల్డ్ నెస్ కలగలిసిన ఆమె పోజులు కుర్రకారును తెగ కవ్వించేస్తున్నాయి.
తాజాగా పూనమ్ బజ్వా పోస్ట్ చేసిన హాట్ పోజుల్లో ఆమె నాభి అందాలు యూత్ ను ఫిదా చేసేస్తున్నాయి. దాదాపు 16 ఏళ్ళ క్రితం కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అదే ఫిట్ నెస్ తో, అదే సౌందర్యంతో మెప్పిస్తోంది. ఎలాంటి డ్రెస్ కట్టినా.. ఆమె అందాలు అందులో ప్రత్యేకంగా ఫోకస్ అవడం విశేషం. ప్రస్తుతం పూనమ్ నేవల్ బ్యూటీ ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Must Read ;- కజిన్ ఆఫ్ అనన్యా పాండే .. ఏంజిల్ ఆఫ్ హాట్ నెస్