ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గత నెలలో కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరంతో పాటు షుగర్ లెవల్స్ పెరగడంతో తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. స్పీకర్ కు వైద్య పరీక్షలు, ఇతర టెస్టులు చేయగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రిపోర్ట్ వచ్చింది. స్పీకర్ ఆరోగ్యంగా పూర్తిగా నయంకావడంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తమ్మినేని ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Must Read ;- శాసన మండలి ఛైర్మన్‌గా మహ్మద్ ఇక్బాల్, డిప్యూటీగా జంగా..











