మన్నారా చోప్రా.. ఈ పేరు ఇప్పుడు హాట్ నెస్ కు బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు మైగ్రేట్ అయిన అందాల సుందరి. అమ్మడు బాగా బ్రాడ్ మైండెడ్. అందుకే ఏమీ దాచుకోకుండా.. తన సోయగాల్ని ప్రదర్శిస్తూంటుంది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి బాబాయ్ కూతురు. అలాగే.. పరిణీత చోప్రాకీ చెల్లెలు వరస అవుతుంది. అందుకేనేమో ఆ ఇద్దరి బ్యూటీస్ తెంపరితనాన్ని అరువుతెచ్చుకుంది ఈ క్యూటీ.
ఢిల్లీలో ఎడ్యుకేషన్ ను పూర్తి చేసిన మన్నారా చోప్రా ముంబైలో మోడలింగ్ ఫీల్డ్ లో కాలుమోపింది. 40 కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఆ క్రెడిట్ తోనే ‘జిద్’ అనే సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత జక్కన్న, తిక్క, రోగ్ , సీత లాంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే మరికొన్ని తమిళ మూవీస్ లోనూ ప్రధాన పాత్రలు పోషించింది. తరచుగా ఫ్యాషన్ వీక్స్ లో తన తళుకు బెళుకులు ప్రదర్శిస్తుంటుంది.
ఇక మన్నారా చోప్రా.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్. తరచుగా తన హాట్ అండ్ బోల్డ్ పిక్స్ షేర్ చేసి భారీ ఎత్తున ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమె ఎలాంటి పోజు పెట్టినా.. క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. తాజాగా మన్నారా చోప్రా షేర్ చేసిన హాట్ పిక్స్ .. ఇన్ స్టా గ్రామ్ ను వేడెక్కిస్తున్నాయి. అమ్మడి డ్రెస్ సెన్స్ కి, సెన్సువల్ ఎక్స్ ప్రెషన్స్ కు ఓ రేంజ్ లో స్పందన లభిస్తోంది. అంతేకాదు.. దీనికో క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. నేను రెండు చోట్ల ఉంటాను. ఇక్కడా.. మీరెక్కడుంటే అక్కడా.. అంటూ నెటిజెన్స్ ను భలేగా రెచ్చగొడుతోంది. దీనికి ఎందరి నుంచో కామెంట్స్ పడుతున్నాయి.
Must Read ;- హాట్ నెస్ తో చితక్కొడుతోన్న నిక్కీ తంబోలి