డ్రగ్స్ రవాణా చేస్తున్న ఓ మహిళను శంషాబాద్ విమానాశ్రయంలో, మరొకరిని చెన్నైలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళపై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా 8 కిలోల హెరాయిన్ పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ రూ. 53 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా కరోల్‌గా గుర్తించారు. కాగా,చెన్నై విమానాశ్రయంలో కూడ మరో మహిళ నుంచి 10 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు.దీని విలువ రూ.73 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.ఆమె కూడ సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు.ఇటు హైదరాబాద్, అటు చెన్నైలోనూ భారీగా హెరాయిన్ పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.పట్టుబడిన ఇద్దరు మహిళలకు లింక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.వారు ఎక్కడి నుంచి ఎక్కడకు హెరాయిన్ తరలిస్తున్నారు,వారి వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు విచారిస్తున్నారు.
Must Read ;- తెలంగాణ లీడర్లను వణికిస్తున్న బెంగళూరు డ్రగ్స్ కేసు










