కమెడియన్… హీరో… కమెడియన్… హీరో- నటుడు సునీల్ గాఫ్ ఇలా ముందుకుపోతోంది. సునీల్ లో చాలా కోణాలు ఉన్నాయి. కామెడీ టైమింగే కాదు మంచి డ్యాన్సర్ కూడా. కాకపోతే సినిమా రంగంలో టైమింగ్ తోపాటు టైమ్ కూడా కలిసి రావాలి. సునీల్ కు ఇప్పుడు హీరోగా మళ్లీ టైమ్ వచ్చినట్టుంది. ‘వేదాంతం రాఘవయ్య’గా మళ్లీ సందడి చేయబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని అంటున్నారు. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం కనిపించడం లేదు. దర్శకుడి పేరు ఇంకా తెరపైకి రాలేదు. కథను మాత్రం హరీషే సమకూర్చారు. ఈ రెండో ఇన్నింగ్స్ లోనైనా సునీల్ హీరో మళ్లీ బిజీ అవుతారేమో చూద్దాం.












