తెలుగు వాళ్లు వివిధ దేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉండడం కొత్తేమీకాదు. వారి ప్రతిభతో ఎందరో రాష్ట్ర ఖ్యాతిని దేశాంతరాల్లో మార్మోగించారు. అలాంటి లిస్ట్ తన పేరు కూడా నమోదు చేసుకున్నాడు ‘రాజేష్ వెన్నం’. ఎందరో అలా ఎన్నికవుతారు.. ఇతనేంటి ప్రత్యేకత అనుకుంటున్నారా.. రాజేష్ మన తెలుగువాడు కావడమే ప్రత్యేకత. చీఫ్ ఫైనాన్షియర్‌గా ఎన్నికైన సందర్భంగా రాజేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
17 ఏళ్ల ప్రయాణం
2003లో డార్డన్ కంపెనీలో మార్కెటింగ్ అభివృద్ధి చేయడానికి బిజినెస్ అనలిస్ట్‌గా చేరిన రాజేష్.. నేడు చీఫ్ ఫైనాన్షియర్‌గా ఎన్నికయ్యాడు. 2010లో ఫైనాన్షియర్ ప్లానర్‌గా పదోన్నతి అందుకున్నాడు రాజేష్. 2013 డార్డన్ కంపెలోని భాగమైన రెడ్ లాబ్ స్టర్‌లో సీనియర్ డైరెక్టర్‌గా పదివిని అందుకున్నాడు. తిరిగి 2016 లో డార్డన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా చేరి తన ప్రతిభతో నేటికి ఈ అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. ఇది రాజేష్ ప్రతిభకు తక్కిన గౌరవం అంటూ కంపెనీలోని ప్రముఖులు తమ అభినందనలను తెలియజేశారు.
Must Read ;- బంగారు పతకాన్ని ‘గురి’ చూసి కొట్టింది











