కరోనా కేసులు పెరుగుతుండటం, దాంతో పాటే మరణాల సంఖ్య కూడా పైపైకి వెళ్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆశయానికి నాంది పలికింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘Hope Help’ పేరుతో కరోనా చికిత్సకు సంబంధించి ఎలాంటి సహాయం కోసమైనా తమను సంప్రదించాలని కోరింది. అందుకు ట్విట్టర్ ద్వారా #SOSTDP లేదా #JAITDP హ్యాష్ ట్యాగ్‌లతో తెలుగు రాష్ర్టాల ప్రజలు సాయం కోరవచ్చు. ఈ క్యాంపెయిన్ తో కరోనాపై అవగాహన, సాయం లాంటివి పొందవచ్చు.
Must Read ;- అరెస్టులు, కూల్చివేతలు, కరోనా మరణాలు కప్పిపుచ్చేందుకేనా?
కరోనాతో పోరాడుతున్న ప్రజలకు సాయపడేందుకు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలపై “Hope. Help.” ప్రచార వేదికను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. మీకు లేదా మీరు సూచించిన అవసరార్థులకు కరోనా విషయమై సాయం కోరేందుకు ట్విట్టర్ ద్వారా @jaitdp కి #SOSTDP అని ట్వీట్ చేయండి. #HopeHelpCycle 🚲 pic.twitter.com/cMyBWH6TEI
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) April 28, 2021