షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి వీరులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గౌరవవందనం సమర్పించారు. విప్లవ వీరులను స్మరిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి వాళ్లు యువశక్తికి, దేశభక్తికి ఓ నిర్వచనమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు వారు చేసిన త్యాగాల ఫలితంగానే స్వేఛ్ఛ లభించిందన్నారు. అలాంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రతిఒక్కరూ విప్లవ వీరులను స్మరించుకోవాలని, వారి బాటలో నడువాలని గుర్తు చేశారు. ‘భరతమాత ముద్దుబిడ్డలైన వీళ్ల త్యాగాలు అన్ని తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని’ ప్రధాన మంత్రి మోదీ కూడా ట్విట్ చేశారు.
Must Read ;- ఈ పాపం వారిని వదలదు.. నారా లోకేష్
యువశక్తికి, దేశభక్తికి తమ జీవితాలనే నిర్వచనంగా చెప్పిన ధన్యజీవులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు వారు చేసిన త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వేఛ్ఛను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. షహీద్ దివస్ సందర్భంగా ఆ విప్లవవీరులకు గౌరవవందనం సమర్పిద్దాం. pic.twitter.com/EN0X8VZOim
— Lokesh Nara (@naralokesh) March 23, 2021











