ఓ వైపు కేంద్రం విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు చర్యలు తీసుకుంటుండగా మరోవైపు దాని పరిరక్షణకు ఎలా చర్యలు తీసుకోవాలన్న దానిపై మేథావులు చర్చలు సాగిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రిటైర్డ్ జేడీ వీవీ లక్ష్మీనారాయణలు నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా తీసుకెళ్లాలన్న దానిపై చర్చించారు. ఇప్పటికే వీవీ లక్ష్మీనారాయణ చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించవచ్చంటూ కేంద్రానికి లేఖ రాశారు. అయినా కేంద్రం ఇవేమి పట్టించుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతుండటంతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ ప్రజా ఉద్యమంగా మలచటానికి ప్రయత్నిస్తున్నారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఉద్యోగులకు ఎసరు: ఉండవల్లి