సిల్లీ కేసులతో చంద్రబాబును భయపెట్టలేరని, నెరిసిన గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఎదుర్కొలేక టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో దళితులపై బెదిరించి అసైన్డ్ భూముల తీసుకున్నారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సీఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల వ్యవహరంపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని అంతం చేయలేరన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, చివరకు ఎస్టీ, ఎస్టీ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నోటీసుల వ్యవహరమై నారా చంద్రబాబునాయుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
Must Read ;- ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు.. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు