తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసాయి. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే చేలో ఉన్న పంట మొత్తం నీట మునగడంతో దిక్కుతోచని స్థితిలో మరికొందరు రైతన్నలు ఉన్నారు. అనేక ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరద సహాయక చర్యలు సరిగ్గా తీసుకోవట్లేదంటూ ప్రతిపక్ష నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. సాయం చేయడంలో ప్రభుత్వం జాప్యం చూపిస్తుందని తెలుస్తుంది.
సాయం కోసం నీటిలో మునగాలా..?
‘ప్రభుత్వం నుంచి సాయం పొందాలంటే కనీసం వారం రోజులు ముంపులో మునగాలన్న నిబంధనను ఏ ప్రభుత్వమైనా పెడుతుందా? సహాయం అందించాల్సింది పోయి షరతులు పెడతారా’ అంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.
ఇళ్లు, వాకిళ్లు, పంట అంతా మునిగిపోయి దిక్కు తోచని స్థితిలో మేము ఉంటే కేవలం రూ.500 ప్రభుత్వం తరుఫు నుంచి ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎక్కడ ఏముందో కూడా తెలియడం లేదు
వరదలు ముంచెత్తడంతో అది పొలామో? స్థలామో? కూడా తెలియని స్థితిలో మేము ఉన్నాం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో తెలియడం లేదు. కనీసం మా గోడు వినిపించుకోవడానికి ఒక్క అధికారి కూడా మా దగ్గరకు రావడం లేదంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తీర్చాల్సింది పోయి హెలికాఫ్టర్ లో పైన చక్కర్లు కొట్టేస్తే మాకు జరిగిన నష్టం తీరిపోతుందా? అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం గారు దీనిపై స్పందించండి
‘రాష్ట్ర ప్రజలు వరదల కారణంగా నీటిలో మునిగి ఉంటే కనీసం వారిని పరామర్శించడానికి సీఎం వెళ్లకపోగా గాలిలో ప్రదక్షిణలు చేశారంటూ ’చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాలని తెదేపా నాయకుడు దేవినేని ఉమా అన్నారు. ముంపు సాయం పొందాలంటే కనీసం వారం రోజులు ముంపులో ఉండాలన్న నిబంధన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పెట్టి ఉండదు. దీనిపై సరైన సమాధానం ఇవ్వాలంటూ దేవినేని అన్నారు.
సాయం పొందాలంటే వారం ముంపులో మునగాలన్న నిబంధన ఏ ప్రభుత్వమైనా పెడుతుందా? ఔధార్యం చూపాల్సిన చోట షరతులు విధిస్తారా? అపార నష్టానికి 500 ఇచ్చి చేతులు దులుపుకుంటారా? మంత్రులను బాధితులు నిలదీస్తున్నారని ముఖ్యమంత్రి గాల్లో ప్రదక్షిణలు చేశాడంటున్న @ncbn మాటలకు సమాధానం చెప్పండి @ysjagan pic.twitter.com/jVArCaJ15N
— Devineni Uma (@DevineniUma) October 21, 2020