‘మల్లేశం’ లాంటి లైఫ్ స్టోరీలో కథానాయికగా పద్ధతిగా నటించిన అచ్చ తెలంగాణ అమ్మాయి ‘అనన్య నాగళ్ళ’. అందానికి అందం, పెర్ఫార్మెన్స్ కు పెర్ఫార్మెన్స్ ఆమె ప్రత్యేకత. తొలి చిత్రంతోనే తన టాలెంట్ ఏ పాటిదో తెలియచెప్పింది అనన్య. ఆ తర్వాత‘ ప్లే బ్యాక్’ అనే సైంటిఫిక్ మూవీలోనూ నటించింది. ఈ రెండు సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించిన అనన్య.. పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మూవీలో డీ గ్లామరైజ్డ్ రోల్ చేసినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది.
ఐతే తొలి మూడు సినిమాల్లోనూ లుక్స్ పరంగా అనన్య చాలా వెనుకబడింది. కేవలం ట్రెడిషనల్ లుక్స్ తోనే రివీల్ అయ్యింది కానీ.. తనలోని గ్లామర్ యాంగిల్ ను బైటికి తీయలేకపోయింది. కమర్షియల్ హీరోయిన్ కావాలంటే.. ఈ తరహా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించకూడదు. తనలోని గ్లామర్ కోణాన్ని ఎంతబాగా ప్రొజెక్ట్ చేస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. అందుకేనేమో ఇప్పుడు అనన్య నాగళ్ళ తనలోని గ్లామర్ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నాన్ని చాలా బలంగా చేస్తోంది.
ఈ మధ్య ఔట్ డోర్ లో అనన్య శారీతో చేసిన ఫోటో షూట్ వల్ల అనన్యలోని కొత్త హాట్ కోణం జనానికి తెలిసింది. అందులో తన నడుము ఒంపులు చూపిస్తూ.. సెక్సీ పోజులతో పిచ్చెక్కించింది. అది సరిపోదు అన్నట్టు .. తాజాగా ఆమె చేసిన ఓ సెల్ఫీ వీడియోతో అనన్య అంత సెక్సీనా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అమ్మడిలోని ఈ తరహా యాంగిల్స్ చూస్తుంటే.. ముందు ముందు నటించబోయే సినిమాల్లో గ్లామర్ డోస్ బాగా పెంచుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ తరహా పోజులకు అవకాశాలు ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.
Must Read ;- ఖాకీ డ్రెస్లో కోహినూర్ ఢైమండ్.. ఆమే దీపిక మండవ పాటిల్