పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కుతోన్న కోర్ట్ రూమ్ డ్రామా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ ‘పింక్’ మూవీ ఆధారంగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చేనెల 9 తేదీన ప్రంపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా కాగా.. మరో ప్రధాన పాత్రను ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా.. వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ బేస్ బాల్ స్టిక్ పట్టుకొని కూర్చుని ఉండగా.. ఈ సినిమలో ప్రధాన పాత్రధారులైన .. అంజలి, నివేదా థామస్ , అనన్య నాగళ్ళ ఆయన చుట్టూ నిలబడ్డారు. ఇందులో వకీల్ సాబ్ వపన్ కళ్యాణ్ .. న్యాయం కోసం తనని ఆశ్రయించిన ఆ ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరగడానికి ఓ కాంప్లికేటెడ్ కేసు వాదిస్తారు. ఆ సందర్భంగా వచ్చే కోర్ట్ సీన్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తాయని తెలుస్తోంది. తమన్ సంగీత సారధ్యంలో విడుదలైన సింగిల్స్ .. అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే. ఆ మధ్య విడుదలైన సినిమా టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా పవర్ స్టార్ కు ఏ రేంజ్ హిట్ ను అందిస్తుందో చూడాలి.
Must Read ;- ‘వకీల్ సాబ్’ నుంచి ‘సత్యమేవ జయతే’ లిరికల్ సాంగ్ విడుదల
Here's wishing all the women out there a #HappyWomensDay from team #VakeelSaab#VakeelSaabOnApril9th
Power Star @PawanKalyan#SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @SVC_official @BayViewProjOffl @BoneyKapoor @adityamusic pic.twitter.com/39UbEWbYVK
— BARaju (@baraju_SuperHit) March 8, 2021