దర్శకేంద్రుడి ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో గ్లామర్ గాళ్ గా మెరిసింది తాప్సీ పన్ను. ఆ సినిమా రిజల్ట్ ఏమైనప్పటికీ.. అమ్మడి గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ క్రేజ్ తో టాలీవుడ్ లో పలు చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకుంది. అయినప్పటికీ.. ఆమెకి ఇక్కడ సరైన గుర్తింపు రాలేదు. అయితే అదే చేత్తో తమిళ, మలయాళ సినిమాల్లో సైతం నటించింది. అయినా సరే అక్కడ కూడా ఆమెకి అంతగా ప్రయోజనం కలగలేదు.
ఫైనల్ గా తాప్సీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంది. ఛష్మి బద్దూర్, బేబీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక పింక్ సినిమా తాప్సీ కెరీర్ నే మలుపుతిప్పింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తాప్సీని బాలీవుడ్ కే క్వీన్ నే చేసేశాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆరేడు సినిమాలు చేస్తున్న తాప్సీ.. ఇప్పుడు మరో సారి తనలోని గ్లామర్ యాంగిల్ ను బైటికి తీస్తోంది.
ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలతోనూ, ఆ పోజులతోనూ తాప్సీ తనకి కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పకనే చెబుతోంది. మరి బాలీవుడ్ లో తాప్సీ కోసం ఇంకా అలాంటి అవకాశాలేమైనా వస్తాయేమో చూడాలి.
Must Read ;- ‘అంటే సుందరానికీ ..’ సినిమా మొదలుపెట్టిన మల్లూ సుందరి










