తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కుమారిగా కొలువై ఉండిపోయింది అందాల హెబ్బాపటేల్. బోల్డ్ నెస్ అండ్ హాట్ నెస్ కలబోసిన ఆ బ్యూటీ.. లాస్ట్ ఇయర్ .. ‘భీష్మ, ఒరేయ్ బుజ్జిగా’ సినిమాల్లో కనిపించి కనువిందు చేసిన అమ్మడు.. ఈ ఏడాది రామ్ ‘రెడ్’ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో అలరించబోతోంది. ఇక లేటెస్ట్ గా హెబ్బా పటేల్ .. ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీలో నటించబోతోంది. సినిమా పేరు ‘తెలిసివాళ్ళు’. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఒక కుర్చీలో కూర్చున్న తలలేని ఒక అమ్మాయి శరీరం రివీలవగా.. ఆ వెనుక గోడ మీద హెబ్బా పటేల్ ఫోటో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ..ఈ సినిమా ఓ వెరైటీ కాన్పెప్ట్ తో రూపొందిన హారర్ మూవీ అనిపిస్తోంది. ఇంకా ఈ సినిమా టైటిల్ ‘తెలిసినవాళ్ళు’ లో వాళ్ళు అనే పదాన్ని బ్లర్ చేశారు. సిరింజ్ సినిమా బ్యానర్ పై కేయస్వీ సమర్పణలో విఐపి లవ్ కోనేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాకి దీపక్ రాజగోపాలన్ సంగీతం అందిస్తున్నరు. ఇందులో మిగిలిన కేస్టింగ్ కు సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు. అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి ఈ సినిమా హెబ్బా పటేల్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ఆ క్రేజ్ కోసం తెగ ఆరాటపడుతున్న హెబ్బా!
New Look With New Concept !
Presenting @IamHebahPatel As #𝐂𝐡𝐚𝐢𝐭𝐫𝐚 into the world !#Telisinavaallu #HappyWomensDay@MrKarthiKKG @LokeshPavithra @ItsActorNaresh#KSV @Viplove_species #AjayNag#DeepakVenugopalan @Syringe_Cinema @jk_dr@VrMadhuPr pic.twitter.com/vVUbuwYUmx
— BA Raju's Team (@baraju_SuperHit) March 8, 2021











