వైసీపీ ఎంపీ రఘురామరాజు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రఘురామ అరెస్ట్ చేసిననాటి నుంచే ప్రతిరోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ రఘురామరాజుపై తిట్లదండకం ప్రయోగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే సమయంలో రఘురామరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ గుర్తు, మా అభిమాన నాయకుడి జగన్ ఫొటోతో గెలిచిన ఓ వెధవ.. ప్రభుత్వంపై మీసలు తిప్పుతున్నారు. నువ్వు రాజీనామా చేస్తే.. కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు’’ అంటూ రఘురామపై రెచ్చిపోయారు. ఆ తర్వాత తేరుకొని నా వైపు తప్పులుంటే క్షమించాలని స్పీకర్ ను కోరారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మిగతా వారంతా నవ్వడం ఆశ్చర్యపర్చింది. కాగా సీఎం జగన్ ఎమ్మెల్యేకు థ్యాంక్స్ చెప్పారు.
Must Read ;- మాస్క్ లేకుండానే అసెంబ్లీకి జగన్, మంత్రులు : ఇంకెన్ని ప్రాణాలు బలితీసుకుంటావ్..లోకేశ్ ఆగ్రహం











