పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే సామెత కు సరిగ్గా సరిపోతారు మన తెలుగు హీరోయిన్స్ . గ్లామర్ ఒలకబోయడానికి, బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ముందు రారనో, లేక సరిపోరనో .. కారణం ఏదైతేనేం.. మన దర్శకులు వారికి అవకాశాలివ్వడానికి ఎందుకోగానీ ఆలోచిస్తారు. అదే ఇతర రాష్ట్రాల ముద్దుగుమ్మలకు రెడ్ కార్పెట్ పరుస్తారు. ఎలాంటి మొహమాటం లేకుండా.. అందాల ఆరబోతకు సిద్ధమవుతారు కాబట్టే వారికి మన దర్శకులు అవకాశాలిస్తున్నారని అనుకోవాలి.

అయితే తమకి అలాంటివేమీ లేవని, అవకాశాలు రావాలే కానీ.. ముంబై ముద్దు గుమ్మల కన్నా, మల్లూ బ్యూటీస్ కన్నా తాము ఎందులోనూ తీసిపోమని .. సోషల్ మీడియాలో హాట్ పోజులతో ఆన్సర్ ఇస్తుంటారు. అలాంటి వారిలో ఎప్పుడూ ఉండే ఒక పేరు ఇషా రెబ్బా. సోషల్ మీడియాలో అమ్మడు రెగ్యులర్ గా ఫోటోస్ ను పోస్ట్ చేస్తూ నెటిజెన్స్ ను కవ్విస్తూ ఉంటుంది. అయితే లేటెస్ట్ గా ఇషా రెబ్బా.. మరింతగా హాట్ పోజుల్ని షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.

గతంలో చిన్న గౌనులో చిలిపిగా కనిపించిన ఇషా.. మరోసారి రెట్ హాట్ గౌన్ లో కనిపించి కనువిందు చేసింది. ఆ పోజుల్లో అమ్మడ్ని చూస్తున్న కుర్రకారు.. ముంబై బ్యూటీస్ ను మించి.. అందాల్ని ఒలకబోసింది అనే కామెంట్స్ చేస్తున్నారు. క్లీవేజ్ షోతో పాటు థై షో కూడా చేస్తోన్న ఇషారెబ్బా..అవకాశాల పరంగా కాస్తంత నిరాశచెందుతోంది. ముఖ్యంగా తెలుగులో అమ్మడికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రావడం లేదు. ఒకటీ అరా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ.. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. మరి ఆమెను అదృష్ట దేవత ఎప్పటికి కనికరిస్తుందో చూడాలి.
Must Read ;- బికినీ అందాలతో మతిపొగొడుతోన్న మలయాళ ముద్దుగుమ్మ












