తెలుగమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ లో సరైనా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అందాల ఈషా రెబ్బ. ‘అరవింద సమేత వీరరాఘవ’ లాంటి పెద్ద సినిమాల్లో అవకాశం అందుకున్నప్పటికీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సోషల్ మీడియాలో హాట్ పోజులతో దర్శక నిర్మాతల్ని ఆకర్షించే కార్యక్రమాన్ని నిర్విఘ్నం గా చేపట్టింది. దాంతో అమ్మడికి ‘పిట్టకథలు’ లాంటి బోల్డ్ మూవీలో ఓ పెక్యులర్ కేరక్టర్ లభించింది. అందులో ఆమె అందాలు ఆకర్షణీయంగా ఉండడంతో .. ఆమెను మాలీవుడ్ నుంచి ఓ అరుదైన అవకాశం వరించింది.
కుంచాకో బోబన్ లాంటి స్టార్ హీరో నటిస్తోన్న ‘ఒట్టు’ అనే మూవీలో కథానాయికగా ఇషా రెబ్బకి అవకాశం వచ్చింది. ఆహా ఓటీటీలో విడుదలైన ‘మిడ్ నైట్ మర్డర్స్’ సినిమాతో కుంచాకో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు. ఇదే సినిమాలో తమిళ నటుడు అరవింద్ స్వామి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఇందులో ఓ తమిళ విలన్, ఆడుకళాం నరేన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘తీవండి’ అనే మూవీతో మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఫెలీని దీనికి దర్శకుడు. మార్చ్ 24న గోవాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 40 రోజులు అక్కడే చిత్రీకరణ జరుపుకోనుంది సినిమా. మరి మాలీవుడ్ లో అయినా ఈషా రెబ్బకి కథానాయికగా బ్రేక్ వస్తుందేమో చూడాలి.
Must Read ;- ఈషా రెబ్బా అందాల శిల్పమే!











