ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు జీవో విడుదల చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.మంగళవారం మంత్రులందరితో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నకేసీఆర్ లాక్ డౌన్ పొడిగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.మంత్రులందరూ జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు,వైద్య సేవలు పర్యవేక్షిస్తున్నందున ఈ నెల 20న నిర్వహించాలనుకున్న క్యాబినెట్ సమావేశాన్నిసీఎం రద్దు చేశారు.
Must Read ;- గాంధీలో సీఎం : కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్











