బాలీవుడ్ అందాల సుందరి, స్టార్ డాటర్ సోనమ్ కపూర్ రూటే వేరు. బోల్డ్ అండ్ హాట్ పోజులతో నిత్యం తన ఇన్ స్టా ఖాతాను వేడెక్కించడం ఈ అమ్మడి పని. వెండి తెర మీద అమ్మడి అందాల ఆరబోత .. మిగిలిన కథానాయికలకి కాస్తంత భిన్నం. అనిల్ కపూర్ నట వారసురాలిగా బాలీవుడ్ లోకి ప్రవేశించిన సోనమ్ కపూర్ .. అనతి కాలంలోనే బాలీవుడ్ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. పెళ్ళయ్యాకా అమ్మడు సినిమాల్ని తగ్గించి.. వ్యాపారం మీదే ప్రత్యేక దృష్టిపెట్టింది.

నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉండే సోనమ్.. లేటెస్ట్ గా తన ఇన్ స్టా ఖాతాలో ఓ బోల్డ్ పోజు పోస్ట్ చేసి.. నెటిజెన్స్ లో అగ్గిరాజేసింది. అనామికా ఖన్నా డిజైనర్ లుక్ లో ఇంతకు ముందు అలరించిన అమ్మడు.. లేటెస్ట్ సిరీస్ లో మరో కొత్త ఫోటోను షేర్ చేసింది. బటన్ లెస్ పోజుతో ఎద అందాల్ని చూపుతూ .. అమ్మడిచ్చిన సెన్సువల్ లుక్ కు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. సోనమ్ లుక్ రియల్లీ ఎక్ ప్రెసివ్ అంటూ.. ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read:టాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ బ్యూటీ?











