ఉగాది నుంచి సచివాలయ ఉద్యోగులకు యూనిఫారం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.సచివాలయ ఉద్యోగులను ప్రజలు సులువుగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మహిళా పోలీసులు, ఏఎనఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు (లైనమెన్లు) మినహా మిగిలిన వారంతా యూనిఫారం ధరించాల్సిందేనని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.దీనికి సంబంధించి వారికి డ్రెస్‌కోడ్‌ను నిర్ణయించి, ఒక్కో ఉద్యోగికి మూడు జతల చొప్పున అవసరమైన వస్త్రాన్ని, బ్యాడ్జీలను సైతం పంపిణీ చేసింది.అదేసమయంలో ఉగాది నుంచి యూనిఫారం ధరించని వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది ఉద్యోగులు హడావుడిగా యూనిఫారం కుట్టించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే దుస్తుల కుట్టు కూలీ అందించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, యూనిఫారం క్లాత్ లు అందించి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకూ వారికి కుట్టు కూలీ చెల్లించలేదు.
మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్లు ప్రతిన పూనాలి.
నందమూరి తారాకరామారావు గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రతి ఏడాది మే 27-...