ఏపీలో మరోసారి విద్యుత్ చార్జీల మోత మోగింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సి) నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు 1 రూపాయి 40 పైసలు , 126 నుంచి 225 యూనిట్ల వరకు 1 రూపాయి 57 పైసలు, 226 నుంచి 400 యూనిట్ల వరకు 1 రూపాయి 16 పైసలు , 400 యూనిట్ల వినియోగం దాటితే యూనిట్ పై 55 పైసలు పెంచుతున్నట్లు ఏపీఈఆర్సి ప్రకటించింది. ఏపీఈఆర్సి ప్రకటించిన ఈ కొత్త టారిఫ్ ఈ ఏడాది ఆగస్టు నుంచి అమల్లోకి రానుండగా, వచ్చే ఏడాది మార్చి వరకు ఇవే ధరలు కొనసాగుతాయి.అయితే ఒక ఏడాదిలో ఇలా రెండు విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను అమలు చేయడం ఇదే తొలిసారని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.
Must Read:-ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయాలు! కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల పరిస్థితి ఏంటి?