వైవిధ్యమైన కథాంశంతో విశాల్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ‘నాట్ ఎ కామన్ మ్యాన్ ’ అనే మాటతో ఓ పోస్టర్ ను కూడా గతంలో రిలీజ్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. `ఈదు థెవైయో అధువే ధర్మం` అనే తమిళ షార్ట్ ఫిల్మ్ తో మంచి పేరు తెచ్చుకున్న శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ఈ సినిమాకి హ్యాష్ ట్యాగ్. విశాల్ కు ఇది 31 వ చిత్రం. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యం, ఎడిటర్ ఎన్. బి. శ్రీకాంత్, ఆర్ట్ ఎస్.ఎస్. మూర్తి. తమ యూనిట్ తో కలిసి ప్రారంభోత్సవ ఫొటోను విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ సినిమా ప్రారంభోత్సం విషయాన్ని పోస్టు చేయగానే ఈ కరోనా సమయంలో షూటింగ్ చేయవద్దంటూ ఆయనకు వినతులు వెళ్లాయి. విశాల్ ప్రస్తుతం తన స్నేహితుడు ఆర్యతో కలిసి `ఎనిమి` అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కొత్త సినిమా ప్రారంభించేశారు.











