అడిలైడ్‌లో అట్టర్ ఫ్లాప్ షో.. మెల్‌బోర్న్‌లో మెరుపు ఇన్నింగ్స్.. సిడ్నీలో డ్రాతో శభాష్ అనిపించే ఆట… ఇంతవరకూ పర్వాలేదనిపిస్తోంది. టీమిండియా ఆటతీరు ఆకట్టుకునేలానే సాగింది. కానీ.. ఇప్పుడే అసలు పరీక్ష మొదలైంది. కంగారూలను మట్టికరిపించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. సొంత గడ్డపై సిరీస్ ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. గబ్బాలో తనకున్న రికార్డులను పదిలం చేసుకునేందుకు తహతహలాడుతోంది. చివరికి సిరీస్ ఎవరి సొంతమవుతుందో?
రసవత్తర సమరానికి వేళైంది!
హోరాహోరీగా సాగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో రసవత్తర సమరానికి వేళైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆతిథ్య ఆసీస్ వన్డే సిరీస్ నెగ్గితే.. భారత్ టీ20 సిరీస్ నెగ్గి దీటుగా నిలిచింది. ఇక అసలుసిసలైన టెస్ట్ సిరీస్ కు వచ్చేసరికి పోరాటం శిఖరాగ్ర స్థాయికి చేరింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో దారుణ ఓటమితో సిరీస్ ను ఆరంభించిన టీమిండియా.. మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్‌లో కంగారూలకు దిమ్మదిరిగే షాకిచ్చి 1-1తో సిరీస్ సమం చేసింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌లో చిరస్మరణీయ పోరాటంతో ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకొని ఆతిథ్య జట్టుపై నైతిక విజయం సాధించింది.
గాయాల వేళ.. ఎవరెలా రాణిస్తారో?
నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో చివరి మ్యాచుకు భారత జట్టు సిద్ధమైంది. నాలుగో పోరులో గెలవాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. సారథి కోహ్లీ పితృత్వ సెలవుపై వెళ్లిన తర్వాత అజింక్య రహానె సారథ్యంలో ఓ టెస్టు గెలిచి, మరో మ్యాచును డ్రా చేసుకున్న ఉత్సాహంతో శుక్రవారం నిర్ణయాత్మక మ్యాచుకు సన్నద్ధమవుతోంది. సిడ్నీలో ఓడుతుందనుకున్న మ్యాచును పూజారా, పంత్, విహారి, అశ్విన్ వీరోచిత బ్యాటింగ్‌తో డ్రా చేశారు. బౌలర్లకు అనుకూలించే బ్రిస్బేన్‌లో భారత్ ఎలా ఆడతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా కేఎల్ రాహుల్, విహారి లాంటి బ్యాట్స్‌మెన్, పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, ఆల్‌రౌండర్ జడేజాలు గాయాలతో ఇప్పటికే జట్టుకు దూరమైన వేళ.. టీమ్ఇండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే అంశంపై ఆసక్తి కలిగిస్తోంది.
టీమిండియా వ్యూహాలు ఫలించేనా?
బ్రిస్బేన్ టెస్టులో కనీసం డ్రా చేసుకుని.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని మరో రెండేళ్లు తమవద్దే ఉంచుకోవాలనే పట్టుదలతో టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. గాయంతో దూరమైన మయాంక్.. ఫిట్‌నెస్ ఒకవేళ సాధిస్తే రోహిత్‌శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. మయాంక్ వన్‌డౌన్‌లో వస్తాడని తెలుస్తోంది. తర్వాత పూజారా, రహానె, పంత్ వస్తారని భావిస్తున్నారు. బుమ్రా ఆడతాడా లేదా అన్నది శుక్రవారమే తెలుస్తుంది. ఒకవేళ అతడు ఫిట్నెస్ సాధించకపోతే మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, నటరాజన్ బరిలోకి దిగుతారు. స్పిన్ విభాగంలో అశ్విన్ కొనసాగనుండగా జడేజా స్థానంలో సాహా, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరు బరిలోకి దిగే అవకాశముంది.
ఆసీస్ ఏం చేస్తుందో!
మెల్‌బోర్న్‌లో ఓటమి తర్వాత సిడ్నీలో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి పడిపోయింది. బ్రిస్బేన్‌లో ఆడేందుకు భారత్ భయపడుతుందంటూ వ్యాఖ్యలు చేసినవారంతా సిడ్నీలో టీమిండియా ప్రదర్శన తర్వాత నోరు విప్పే సాహసం చేయలేదు. కఠిన పరిస్థితుల్లోనూ పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని రహానే బృందం ఆడిన తీరు ఆసీస్ శిబిరంలో ఆందోళన పెంచింది స్మిత్ ఫామ్‌లోకి రావడమే ఆ జట్టుకు పెద్ద ఊరట. అతనితో కలిసి లబ్‌షేన్ కూడా రాణిస్తే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు గబ్బా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మూడో టెస్టులో ప్రదర్శన తర్వాత తాము ఎలాంటి సవాల్‌కైనా సిద్ధమని టీమిండియా నిరూపించింది. గబ్బా మైదానంలో 1988 నుంచి ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా రికార్డు పదిలం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈక్రమంలో కచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆసీస్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సమరం ఖాయం!