అక్కినేని నాగర్జున ఎంత వైల్డ్ గా ఉంటాడో తెలిసిపోయింది. పూర్తి యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 04.05 గంటలకు విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఎంతో క్యూరియాసిటీ పెంచేలా ట్రైలర్ ఉందని చిరంజీవి ట్విట్టర్ ద్వారా ముందే తెలిపారు. ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేక్షకుల ముందుకు నాగార్జున సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇంతకుముందు వచ్చిన మన్మధుడు సీక్వెల్ నిరాశ పరిచింది.
ఆ తర్వాత నాగ్ అంగీకరించిన సినిమానే ఈ వైల్డ్ డాగ్. దీని తర్వాత బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మస్త్ర’ ఉండనే ఉంది. ఓ మంచి సక్సెస్ కోసం నాగ్ ఎదురుచూస్తున్నారు. అలాంటి జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సినిమాని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అసిషోర్ సోలోమన్ దర్శకత్వంలో ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. దియామీర్జా ఇందులో హీరోయిన్. ఇంకా సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రచారాన్ని వేగవంతం చేశారు.
Presenting #WildDogTrailer https://t.co/NXWvln1HMD
FEROCIOUS,PATRIOTIC TALE OF
A DAREDEVIL TEAMMy brother Nag is Cool & Energetic as ever
He is a fearless actor attempting all genresWish Team #WildDog & my Producer
Niranjan Reddy GoodLuck! @iamnagarjuna @MatineeEnt— Chiranjeevi Konidela (@KChiruTweets) March 12, 2021
అందులో భాగంగానే ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. కొన్ని యధార్థ సంఘటనలతో దీన్ని రూపొందించారు. 2013 లో హైద్రాబాద్ లో జరిగిన సీరియల్ బాండ్ బ్లాస్ట్స్ ప్రేరణ అంటున్నారు. ఇందులో ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా నాగార్జున పాత్ర ఉంటుంది. సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేస్ ను వంద మంది క్రూతో నాగ్ అన్వేషించి పరిష్కరించడమే ఈ కథ. ఈ ప్రయత్నంలో ఎలాంటి సంఘనటలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాల్సిందే.
ఇది పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి పాటలకు అవకాశం ఉండదని అర్థమవుతోంది. జనవరిలోనే విడుదల కావలసిన ఈ సినిమా విడుదల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారన్నది మాత్రం అర్థంకావడం లేదు. ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది. ఇంతకుముందు ఈ తరహాలోనే ‘గగనం’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా పాటలు లేవు. గగనం మాదిరిగానే ఈ సినిమా హిట్ కొడుతుందో లేదో చూడాలి.
Also Read : నాగ్ ‘వైల్డ్ డాగ్’ అప్ డేట్ వచ్చేసింది
Very happy to share these Screenshots from my friends when they saw #WildDogTrailer#WildDogOnApril2nd@ahishor @MusicThaman @Deonidas @deespeak @SaiyamiKher @ActorAliReza @mayankparakh19 #PrakashSudarshan @onelifeitiz @pasha_always @MatineeEnt pic.twitter.com/cN0tEKKOHw
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 12, 2021