శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాకు విడుదలకు ముందే హైప్ వచ్చింది. హీరో శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది. ఇలాంటి మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాని శర్వానంద్. పేర్కొన్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై కొత్త దర్శకుడు కిషోర్ బి. తో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మించారు. వాస్తవిక సంఘటనలతోనే ఈ సినిమా రూపొందించినట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. చాలా అరుదుగానే ఇలాంటి కథలు దొరుకుతాయని, పంటలు పండించేవారు తక్కువై పోతున్నారు, తినేవారు ఎక్కువైపోతున్నారని శర్వానంద్ అన్నారు.
‘నిర్మాతలు ఇలాంటి సినిమాను నమ్మడం, ఇంత ఖర్చు పెట్టడం చాలా కష్టం. డేరింగ్‌గా ఉంటేనే ఇలాంటి చేస్తారు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ట్రైలర్ చూశాక ఫస్ట్ కాల్ నాకు చరణ్ నుంచి వచ్చింది. సినిమా పాయింట్ బాగుంది. నేను ఈ సినిమాను సపోర్ట్ చేయాలను కుంటున్నా అన్నారు. వెంటనే ఆయన చిరంజీవిగారికి చెప్పడం, చిరంజీవి గారికి కూడా మేం చూపించాం. 8న ఖమ్మంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే కేటీఆర్‌గారికి ఫోన్ చేశాం. సపోర్ట్ చేసేందుకు ఆయన కూడా రెడీ అయ్యారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగబోయే ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు’ అని శర్వానంద్ వివరించారు.
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ ‘మార్చి 3న సెన్సార్ పూర్తయింది. 11న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నాం. చాలా పాజిటివ్ టైటిల్. ఓ యువరైతు కథ. స్ట్రాంగ్ డైలాగ్స్, బలమైన ఎమోషన్స్‌తో సినిమాను చేశాం. మిక్కీజే మేయర్ మంచి సంగీతం అందించారు. సాయిమాధవ్ బుర్రాగారు ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్స్‌కు అంతే డెప్త్‌గా ఇచ్చారు. ఈ సినిమాకు డైలాగ్స్ అనేవి పెద్ద ఎస్సెట్’ అన్నారు.
దర్శకుడు కిశోర్ మాట్లాడుతూ ‘సినిమా చూస్తున్నప్పుడు మన కథో, మన పక్క ఊరి కథో ఏదో ఒకటి చూస్తున్న భావన కలుగుతుంది. ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. నా కథను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లుగా ఫీలై బయటకు వస్తారు’ అన్నారు. ఈ భూమ్మీద ఒక్క నయాపైసా కూడా దోచుకోనిది రైతు మాత్రమేనని, భూమికీ మనిషికీ మధ్య నడిచే ప్రేమ కథ ఈ సినిమా అని రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. మంచి సినిమా చేసినందుకు తనకెంతో సంతోషంగా ఉందని హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహనన్ అన్నారు.
Must Read ;- ట్రైలర్ టాక్: వ్యవసాయ రంగంలో మేలుజాతి కుర్రోడి కథ ‘శ్రీకారం’











