“ఫంటాస్టిక్ తారా” ఫస్ట్ లుక్ తో పాటు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల గారాలపట్టి సితార గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా సితార ముద్దు ముద్దుగా స్పందిస్తూ, .”నేను ఈ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను ”అని అన్నారు.
ఈ ధారావాహిక కథానాయకుడైన తారాకు ప్రేరణ సితార అని చిత్ర దర్శకుడు, రచయిత కె.వి. రాజేంద్ర అన్నారు.
మీరు పిల్లల కోసం ఇలాంటి యానిమేషన్ సిరీస్ లు ఎందుకు చేయకూడదు? అని తన కుమారుడు అడిగాడని, అతని ప్రశ్నకు సమాధానమివ్వడానికి, తాను ఈ సిరీస్‌ను రూపొందించానని రాజేంద్ర తెలిపారు. దీనిని మ్యాజిక్ మ్యాట్రిక్స్ స్టూడియోస్ నిర్మించింది. మాస్ బంక్ మూవీస్ సమర్పించింది. ఈ కార్యక్రమంలో నమ్రత శిరోద్కర్, బాలీవుడ్ నటి నేహా ధూపియా, తెలంగాణ ప్రభుత్వ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- మహేష్, నమ్రతలకు గిఫ్ట్ లు పంపిన పవన్ దంపతులు