టీడీపీ అధికార ప్రతినిధి, అనంతపురం జిల్లా ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌పై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. 24న ముష్టికోవెల పర్యటన సందర్భంగా పరిటాల శ్రీరామ్ తమపై దాడి చేశారని వైసీపీ నేతలు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించి న్యాయం చేయాలని చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడేందుకు పరిటాల శ్రీరామ్ నిన్న స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ఎస్.ఐ రమేష్ బాబుతో చర్చించి బయటకు వచ్చారు. అప్పటికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పరిటాల శ్రీరామ్‌పై దాడి చేసేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు లాఠీ ఛార్జి చేసి వారిని నిలువరించారు. పరిటాల శ్రీరామ్‌ను అక్కడ నుంచి సురక్షితంగా పంపించారు.
పోలీస్ స్టేషన్ ముందే ఇంత అరాచకమా..
పోలీసుల ముందే వైసీపీ నాయకులు తనపై దాడికి యత్నించారని, ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా చూశారని పరిటాల శ్రీరామ్ మీడియాకు వెల్లడించారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, నిరంకుశ పాలన సాగుతోందా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమపై అక్రమ కేసులు పెడుతోన్న పోలీసులు, తమపై దాడి ఘటనకు వారే సాక్ష్యంగా ఉన్నా కూడా కేసులు నమోదు చేయడం లేదని పరిటాల శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమపైనే దాడికి యత్నిస్తున్నారంటే ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Must Read ;- పరిటాల శ్రీరామ్‌పై మరో కేసు నమోదు..











