ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ సీపీ అగడాలకు అడ్డూఅదుపు ఉండటం లేదు. టీడీపీ నాయకులను టార్గెట్ గా చేసుకొని అక్రమ కేసులు, దాడులు, త్రీవ పదజాలం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మచిలీపట్నంలో అధికార పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై నాయకులు దాడులకు తెగబడుతున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిచిన కార్యకర్తలు, జనాలపై దాడులకు దిగుతున్నారు. వైసీపీ కార్పొరేటర్ భర్త చీలి చక్రపాణి, అనుచరులు టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు అసభ్యకరమైన పదజాలంతో దూషణలకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొల్లురవీంద్ర దాడులకు దిగన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : నరహంతక సీఎం జగన్.. టీడీపీ నేత యరపతినేని











