టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులను ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఎన్నికలయ్యాక వైసీపీ కక్ష సాధింపులతో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బుజ్జిపై హత్యాయత్నం కేసుతో పాటు డివిజన్ అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి కనపర్తిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రోద్భలంతో టీడీపీ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌పై కేసు పెట్టారని అచ్చెన్న పేర్కొన్నారు.
వైసీపీ నాయకుల అక్రమాలు కనిపించవా..
ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవేమి పోలీసులకు కనిపించకపోవడం దారుణమన్నారు. ఇన్ని జరుగుతున్నా డీజీపీ, ఎస్ఈసీలు పట్టించుకోకపోవడం ఏమిటని అన్నారు. టీడీపీ నేతలు అడ్డుకుంది వైసీపీ నాయకుల రిగ్గింగ్‌లనే కాని పోలీసుల విధులకు ఎలాంటి అడ్డంకులు కల్పించలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ మద్దతుదారుఎస్ఈసీలుల పొలాలను కూడ వైసీపీ నాయకులు తగులబెడుతూ ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్రమ కేసులను ఎత్తివేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
Also Read :టీడీపీ దూకుడు, వైసీపీలో తడబాటు.. హాట్ హాట్‌గా విజయవాడలో ఎన్నికల ప్రచారం