ఆచార్యతో కలిసి సిద్ధ అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇద్దరూ తుపాకులు చేతబట్టి ముందుకు సాగుతున్న ఫొటోను ఈరోజు ఆచార్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ ను విడుదల చేశారు. మెగాస్టార్ చిరు ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాని నిర్మించడమే కాదు ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రను కూడా పోషించారు.

తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో ఇటీవల చిత్రీకరించారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వారిద్దరూ చేతిలో తుపాకులతో కనిపించిన దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. మే 13న ఈ సినిమా విడుదలకాబోతోంది. ఈ పోస్టర్ మీద దర్శకుడు కొరటాల శివ ట్వీట్ చేస్తూ ‘ధర్మానికి ధైర్యం తోడైన వేళ..’ అని పేర్కొన్నారు.
31న ఆచార్య సినిమాలోని తొలి పాట
మెగాస్టార్ ‘ఆచార్య’లోని తొలిపాట ఈ నెల 31న విడుదల కాబోతోంది. ‘లాహే లాహే’ అనే ఈ పాటను మార్చి 31వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన మెగాస్టార్ లుక్ అభిమానులకు కేక పుట్టిస్తోంది. మెగా స్టార్ చిరంజీవి నుంచి అభిమానులకు కావలసిన స్టెప్పులు ఇందులో ఉంటాయని ఈ లుక్ ద్వారా క్లారిటీ లభించేసింది. మణిశర్మ ఈ సినిమా కోసం అందించిన బాణీలు ఎలా ఉంటాయో చూడాలి.

Must Read ;- ఫ్యాన్స్ కు రామ్ చరణ్ డబుల్ ట్రీట్?











