అనంతపురం జిల్లా టీడీపీ నేత, ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదైంది. మసీదు సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహంచారని ఎన్నికల అధికారి నాగవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పరిటాల శ్రీరామ్‌తో సహా మరో ఏడుగురు అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.
ధర్మవరం మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు 4 రోజులుగా పరిటాల శ్రీరామ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ పదో వార్డులో ప్రచారం నిర్వహిస్తూ మసీదు సమీపంలోకి వెళ్లారు. దీంతో ఎన్నికల అధికారి నాగవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుకోకుండా పరిటాల శ్రీరామ్ మసీదు ప్రాంతానికి వెళ్లారని తెలుస్తోంది. ఎన్నికల అధికారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Must Read ;- కోడ్ ఉల్లంఘన.. పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు











