కరోనా క్రైసిస్ చిత్ర పరిశ్రమ ఎత్తుని, వైశాల్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది. పరిశ్రమ పెద్దలు, సినీ ఎక్స్ పర్ట్స్ ఏళ్లు కొద్దీ కళ్లరా చూసి డబ్బారా అనుభవం తెచ్చుకున్న సీజనల్ నాలేడ్జ్ ని గ్యారేజ్ కి పంపించేసింది కరోనా క్రైసిస్. అసలు థియేటరే లేకపోతే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనే వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందీ మహమ్మారి. సాధారణంగా ఓ సినిమా తీయడకంటే ఆ సినిమాని రిలీజ్ చేయడం ఇవాల్టీ రోజుల్లో నిర్మాతకు తలకు మించిన వ్యవహారంలా ఉంది. ఇండస్ట్రీలో న్యాయంగా సినిమాను బిజినెస్ చేసి నిర్మాతకు లాభాలు వెనక్కి ఇచ్చే పంపిణీ సంస్థలు చేతి వేళ్ల పై లెక్కపెట్టవచ్చు.
కేవలం సురేశ్ ప్రొడక్షన్స్, గీత డిస్ట్రీబ్యూషన్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రీబ్యూషన్, ఏషియన్ ఫిల్మ్ డిస్ట్రీబ్యూషన్ ఇలా అతి కోన్ని సినిమా పంపిణి సంస్థలు నుంచి మాత్రమే నిర్మాతలకు డబ్బులు వెనక్కి వస్తాయి. ఇవి కూడా సినిమా హిట్ అయితేనే లాభాలు నిర్మాతలకు ఇస్తాయి. పొరపాటున ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతే తిరిగి చాలా చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే చాలా వరకు ఈ పంపిణీ సంస్థల చేతుల్లోనే సినిమా రిలీజ్ డేట్లు కూడా ఉంటాయి. వీరు చెప్పిందే ఆన్ సీజన్, నో అన్నది అన్ సీజన్. నిజానికి చాలా వరకు పెద్ద సినిమాలు రిలీజులకి ఉంటే చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమాలకి ఈ పంపిణీ సంస్థలు ఆన్ సీజన్ బోర్డు చూపిస్తుంటాయి.
అయితే ఇప్పుడు ఈ లెక్కల్లో మార్పు వచ్చింది. పండగ సీజన్లు తప్పితే జనాలు మాములు రోజుల్లో సినిమాను థియేటర్లకి వెళ్లి చూసే మూడ్ లో ఉండటం లేదని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దానికి తోడు కరోనా క్రైసిస్ టైమ్ ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ వారు తమకు అనుకూలంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. డైరెక్ట్ ఓటిటి రిలీజులు చేస్తూ ఆడియెన్స్ ను థియేటర్లకి మరింద దూరం చేస్తున్నారు. ఒక్క మాటలో ఆన్ సీజన్ అంటే పండుగ సమయాల్లో ఫ్యామిలితో కలిసి సినిమాకెళ్లడం అన్ సీజన్ అంటే ఓటిటిలో ఉన్న కొత్త సినిమాల్ని ఇంట్లో కుర్చోని చూస్తూ ఎంజాయ్ చేయడం.











