హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన సదన్ ఇప్పడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం భారీతారాగణం. దీపికారెడ్డి, నిరోషా రేఖ హీరోయిన్లు. శేఖర్ ముత్యాల దర్శకుడు. బి.వి.ఆర్. పిక్చర్స్ పతాకంపై బి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హీరో, హీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ నివ్వగా, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆలీ గౌరవ దర్శకత్వం వహించారు. తొలుత ఎం.ఎం.శ్రీలేఖ జ్యోతిప్రజ్వలన గావించారు. నటుడు సంపూర్ణేష్ బాబు కూడా అతిథిగా విచ్చేసి, యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.
అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర దర్శకుడు శేఖర్ ముత్యాల మాట్లాడుతూ, కామెడీతో సాగే లవ్ థ్రిల్లర్ కథ ఇది. నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి చుట్టూ సాగే ప్రేమకధ అని చెప్పారు. నిర్మాత బి.వి.రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. హైదరాబాద్, భీమవరం, ఇంకా గోదావరి పరిసరాలలో చిత్రీకరణ జరుపుతాం.అని అన్నారు.
హీరో సదన్ మాట్లాడుతూ, “ప్రేక్షకులకు మంచి ఆహ్లాదాన్ని పంచే అవకాశం నా తొలి చిత్రంలోనే లభించడం ఆనందంగా ఉంది. దర్శకుడు స్క్రిప్ట్ చాలా బాగా చెప్పారు. మా అందరి నుంచి మంచి నటనను ఆయన రాబట్టుకుంటారన్న నమ్మకం ఉంది“ అని అన్నారు. హీరోయిన్లు దీపికారెడ్డి, నిరోషా రేఖ తమకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఎం.వి.గోపి, సంగీతాన్ని సుక్కు, ఆర్ట్ ను జె.కె.మూర్తి అందిస్తున్నారు.
Also Read ;- టీజర్ టాక్ : అంధురాలైన పోలీసాఫీసర్ గా నయనతార ‘నెట్రికణ్’