అల్లు అర్జున్ సినిమా పుష్ప బాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోనూ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమా మీద హైప్ పెంచడానికి పరోక్ష ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపణ. దానికి కారణం రవీంద్ర జడేజా, సురేష్ రైనా, డ్వేన్ బ్రావో, డేవిడ్ వార్నర్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు పుష్ప పాటలతో చేసిన డ్యాన్స్ వీడియోలు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాంతో ఈ పాటల మీద ఎక్కడా లేని హైప్ వచ్చింది. ఈ క్రికెటర్లు పుష్ప పాటలకు డ్యాన్స్ చేయడానికి వారికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిందనే టాక్ ఉంది. దీనికి సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమాను ప్రమోట్ చేయడం కోసం అమెజాన్ ప్రైమ్ పెయిడ్ కాంపెయిన్ నిర్వహిస్తోందని, అందువల్లే పుష్ప మీద హైప్ వచ్చిందని అంటున్నారు. కానీ ఈ వాదనకు ఆధారాలు లేవు. ఈ క్రికెటర్లు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో పాటలకు డ్యాన్స్ చేశారు. వారు స్వతహాగా ఆ పాటలకు స్పందించి డ్యాన్స్ చేయడానికి అవకాశం ఉంది.
సాధారణం సినిమాకి ప్రచారం చేసే బాధ్యతలను ఓటీటీ సంస్థలు తీసుకోవు. అది వారికి భారం కూడా. అమెజాన్ లో పుష్ప కన్నా పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. మరి వాటికి కూడా పెయిడ్ ప్రమోషన్ చేయవచ్చు కదా. అలా జరగలేదు కాబట్టి ఈ ఆరోపణల్లో వాస్తవం కనిపించడం లేదు. అల్లు అర్జున్ చేసిన శ్రీవల్లి స్టెప్ గానీ, చేతిని గడ్డం కింద నుంచి పోనిచ్చే మ్యానరిజం గానీ క్రికెటర్లను ఆకట్టుకుని ఉండొచ్చు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి వాటిని అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లలో కూడా ఆటగాళ్లు ఈ పాటలపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి. పుష్ప అనేది ట్రెండింగ్ లో ఉన్న సినిమా కాబట్టి ఆటగాళ్లు స్పందించడంలోనూ అర్థముంది.











