సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ఆయనపై జరిగిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను బహిర్గతం చేయడం సరికాదని ప్రభుత్వం పేర్కొంటోంది. అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉండి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారని, దీనిపై 30రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఏబీవీను ప్రభుత్వం ఆదేశించింది. అఖిల భారత సర్వీసు రూల్స్‌ను అతిక్రమించినందున గడువులోగా సరైన వివరణ ఇవ్వకుంటే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
Must Read ;- కీలక ఆధారాలున్నాయన్నా స్పందించ లేదు.. వివేకా హత్యపై సీబీఐకి లేఖ రాసిన ఏబీవీ











