విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ఒకేసారి ‘నారప్ప, ఎఫ్ 3, దృశ్యం 2’ చిత్రాల్ని ట్రాక్ ఎక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘దృశ్యం 2’ మూవీని శరవేగంగా కంప్లీట్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమా టాకీ పార్ట్ కూడా కొద్ది రోజుల్లో కంప్లీట్ కానుందని తెలుస్తోంది. అయితే ముందుగా షూటింగ్ మొదలు పెట్టిన ‘నారప్ప’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నారప్ప’ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన ఆ మూవీకి ఏ మాత్రం తీసిపోని విధంగా నారప్పను తీర్చిదిద్దాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇటీవల ఈ సినిమా ఎడిట్ వెర్షన్ చూసిన నిర్మాత సురేశ్ బాబుకి ఔట్ పుట్ సంతృప్తికరంగా అనిపించిందట. అయితే.. వీటిలో కొన్ని సన్నివేశాల్ని రీ షూట్ చేస్తే .. సినిమా మరింత బెటర్ గా వస్తుందని భావిస్తున్నారట.
అందుకే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సురేశ్ బాబు సూచించిన సన్నివేశాల్ని ప్రస్తుతం రీషూట్ చేస్తున్నాడట. దీంతో సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుందట. ఇటీవల ‘దృశ్యం 2’ చిత్రీకరణను కంప్లీట్ చేసిన వెంకీ.. ప్రస్తుతం ‘నారప్ప’ రీషూట్స్ లో పాల్గొంటున్నాడట. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోసిస్తున్నారట. మణిశర్మ సంగీతం అందించిన ‘నారప్ప’ సినిమాను మే 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతుందో లేక అనుకున్న డేట్ లోనే రిలీజ్ అవుతుందో చూడాలి.
Must Read ;- వెంకీ ‘దృశ్యం 2’ విడుదలయ్యేది థియేటర్స్ లోనా? ఓటీటీలోనా?











