ప్రభుత్వ నిబంధనలకు విరుద్దమైన జీవోలు..!
జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వివాదస్పదం, ప్రజా వ్యతిరేకం! ప్రజావ్యతిరేక నిర్ణయాలకు ఎప్పటికప్పుడు హైకోర్టు బ్రేకులేస్తునే వస్తోంది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్లు 53, 54 లను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేటు స్కూళ్లు, జూ. కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయంస్థానం వ్యాఖ్యానించింది. ప్రైవేటు విద్యాసంస్థల అభిప్రాయాలు తీసుకున్నాకే.. ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఆగష్టులో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో నెంబర్లు 53, 54 లను తీసుకొచ్చింది. పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ పరిధుల్లో ప్రభుత్వం నిర్ణయించి ఫీజులను మాత్రమే వసూల్ చేయాలని నిబంధన పెట్టింది. దీంతో ప్రభుత్వ నిబంధనను వ్యతిరేకిస్తూ.. ప్రైవేటు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ల తరుఫున న్యాయవాది ముతుకుమల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు.
Must Read ;- జగన్ పై సమర శంఖారావం పూరించిన కాషాయదళం..!