ప్రజా ఆగ్రహా సభతో గర్జించనున్న బీజేపీ..!
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏపీ పాలన పగ్గాలను చేపట్టిన నాటి నుంచి అధికారపార్టీకి కాస్తా అనుకూలంగా బీజేపీ వ్యవహిస్తూ వస్తోంది. అమిత్ షా తిరుపతి వేదికగా ఏపీ బీజేపీకి తలంటిన నాటి నుంచి నాయకులు గేర్ మార్చారు. రైతు పాదయాత్రతో ప్రారంభించిన నిరసన గళం.. నేటి వరకు కొనసాగిస్తునే ఉంది. నిత్యం ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో పోరాడేందుకు రూట్ మ్యాప్ ను కూడా బీజేపీ సిద్థం చేసుకుంది. మంగళవారం విజయవాడ సిద్ధార్థ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే ప్రజా ఆగ్రహా వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టేందుకు బీజేపీ టాప్ మోస్ట్ నాయకులందరూ హాజరౌతున్నారు. ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తోపాటు పలువురు జాతీయ నాయకులు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి ..!
జగన్ ప్రభుత్వం పై బీజేపీ ప్రత్యక్ష యుద్దానికే కాలుదువ్వుతోంది. ప్రజా ఆగ్రహా సభ ద్వారా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే కాదు.. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేసింది బీజేపీ. అయితే మొదటి నుంచి కూడా జగన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహిస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా మోదీ నిర్ణయాలను, పథకాలను, తీసుకొస్తున్న నూతన చట్టాలపై ఎక్కడ చిన్నపాటి విమర్శగానీ, అడ్డు చెప్పడం గానీ చేయలేదు. ఈనేపథ్యంలో ఏపీలో రోజురోజుకు అనూహ్యంగా కుటుంబపడుతున్న పాలన, ఊహించని రీతిలో పెరుగున్న ప్రజావ్యతిరేకత కలిపి చూస్తే.. జగన్ రెడ్డి తో జట్టు ఏపీలో బీజేపీకి కూడా రాజకీయంగా దెబ్బపడే అవకాశాలు లేకపోలేదు. ఢిల్లీ పెద్దల నుంచి అందిన ఆదేశాల మేరకు మంగళవారం విజయవాడలో ప్రజా ఆగ్రహా బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇకమీదట వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణించి, నిత్యం సమస్యలపై ప్రజల పక్షానా పోరాడేందుకు సమయక్తమవుతోంది. వీటికి తోడూ ఏపీలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాట, కేంద్ర నిధులను ఏఏ పథకాలకు మరలిస్తున్నారు, రాజధాని, విజయవాడ ఫైవర్ కు కేంద్రం వెచ్చించిన నిధులు వంటివి అనేక విషయాలను సభలో నేతలు ప్రజలకు విన్నవించనున్నారు.
Must Read ;- దాచిపెట్టింది చాలు .. బయటపెట్టండి ..! జగన్ కు సీరియస్ వార్నింగ్..!











