ఓటిఎస్ రద్దు చేసే వరకు నిరసనలు ఆగవు!
పేదల నుంచి సంపూర్ణ గృహ హక్కులంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటిఎస్ ను పేదల మెడకు ఊరితాళ్లుగా అభివర్ణిస్తున్నారు తెలుగు దేశం పార్టీ! ఎప్పుడో దివగంతనేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాలం నాటి( 1983) ప్రభుత్వ ఇళ్లకు బకాయి ఉన్నారని బెదిరించి మరి జగన్ రెడ్డి వసూళ్లు చేయడం దారుణమని ముక్తం కఠంతో ఖండిచారు. సోమవారం ఉదయం ఏపీ వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలో తెలుగు దేశం శ్రేణులు రోడ్డెక్కాయి! రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఓటిఎస్ పేరుతో పేదల నుంచి రూ. 5 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం అధికారపార్టీ చేస్తోందని.. దీనిని ఇప్పటికైన విరమించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజలు దీనిపై అవగాహన పెంచకుని పైసా కూడా చెల్లిచకండి అని సూచిస్తున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా పేదల ఇళ్లన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని హామి ఇచ్చారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ఉన్న జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఇలా సాగిన నిరసనలు…
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని సోమవారం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసనలు, జిల్లా కలెక్టర్లు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి, పార్టీ నేత దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తూ.గో జిల్లాలో తెదేపా నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రు, కొండబాబు ఆధ్వర్యంలో ఓటీఎస్ ను తక్షణమే రద్దు చేయాలని నిరసనలు చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలానే కడప జిల్లాలో తెదేపా నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఒకదశలో ప్రధాన గేటును తోసుకుని మరి వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధాన కూడళ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ, యరపతినేని, కొమ్మాలపాటి, తెనాలి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చే సమయంలో పోలీసులకు, తెదేపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇలా విశాఖ జిల్లాలో, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో తెదేపా శ్రేణలు ఓటిఎస్ రద్దుపై ఆందోళనకు దిగాయి. జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
Must Read ;- అశోక్ గజపతి రాజుపై రెండు సెక్షన్ల కిందా కేసు నమోదు..!











