వంచనతో విద్యార్థుల భవిష్యుత్తు చిత్తు .. !
ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళితే.. అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ. 10 లక్షలు సాయం అందించే పథకాన్ని ప్రస్తుత జగన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశాల్లో విద్యకు అధిక ప్రాధన్యతనిచ్చింది. ‘విదేశీ విద్యాదరణ పథకం’ పథకం ద్వారా రాష్ట్రం వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఆ పథకాన్ని జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపి వేశారు. వారి చదువులు మధ్యలోనే ఆగి, జీవితం అంధకారంలో పడింది. వారి చదువుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చడానికి తల్లిదండ్రులు స్తోమతలేక తనమనకలౌతున్నారు. భారీ మొత్తంలో ఉన్న ఫీజులను చెల్లించలేక, తీవ్ర నిర్వేదంలో ముగిపోతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. దీంతో సీఎం జగన్ కలసి గోడు విన్నవించుకోవాలని కడప జిల్లా వాసులు భావించారు.
వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి పాదయాత్ర..!
‘విదేశీ విద్యాదరణ పథకం‘.. గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పేద మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి… ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు సాయం అందించింది. ఏటా ఎంపికైన విద్యార్థులకు కళాశాల ఫీజులను విదేశీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఇనిస్టాల్మెంట్ కూడా ఫీజుల రూపం చెల్లించలేదు. ఈ పథకాన్ని పూర్తిగా నిలిపేసింది. దీంతో తీవ్ర అవేదనతో కడప జిల్లాకు చెందిన విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ సమాధికి నివాళులర్పించి, పాదయాత్రగా తాడేపల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తాడేపల్లికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఆర్కె వ్యాలీ పోలీసులు హుటాహుటిగా వచ్చిన తల్లిదండ్రులను అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, వారందర్ని ఆటో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. ప్రస్తుతం విదేశాల్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. ప్రభుత్వం ఆదుకోకుంటే వారి పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- రోశయ్య పై జగన్ కక్ష సాధింపు ..! సంతాపం తెలపకపోవడానకి కారణాలివేనా?!











