ఎప్పుడు ఎంట్రీ అనేది క్లారిటీ లేదు. బాలయ్యను మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అడిగినా.. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలియచేస్తానని చెప్పేవారు. అలాగే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గతంలో చెప్పారు. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలి అనుకున్నారు. ఆయన డైరెక్ట్ చేయకపోతే బాలయ్యే డైరెక్ట్ చేయాలి అనుకున్నారు.
Must Read:-బాలయ్య అడిగితే జగన్ కాదంటారా?
ఆతర్వాత సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో కాకుండా.. క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి చిత్రం అంటూ వార్తలు వచ్చాయి కానీ.. ఇది కార్యరూపం దాల్చలేదు. తాజాగా త్వరలో మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్నాడంటూ మళ్లీ వార్తలు మొదలయ్యాయి. ఇటీవల మోక్షజ్ఞ 27లోకి వచ్చేయడంతో ఇదే అతనికి సరైన సమయమని వచ్చే సంవత్సరం అతన్ని హీరోగా పరిచయం చేయడం ఖాయమని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ ఎవరి డైరెక్షన్లో అంటే.. ఇటీవల బాలయ్యకు అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో అని ప్రచారం జరుగుతుంది. మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యతల్ని బోయపాటి తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అంటున్నారు. బోయపాటి.. అఖండ తర్వాత బన్నీతో సినిమా చేయాలనుకున్నారు కానీ.. పుష్ప 2 తర్వాత చేయాలి. దీనికి టైమ్ పడుతుంది. అందుచేత మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు బోయపాటి ఓకే చెప్పారంటున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.












