జగన్ సంస్కారం అక్కడే అర్థమౌతోంది ..!
ఏబీఎన్ చానెల్లో ప్రతివారం ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో చాలా విషయాలను నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పంచుకున్నారు. జగన్ రెడ్డిని కలవాలని ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని మరి ఢిల్లీ నుంచి వస్తే .. కనీసం కలవకుండా పీఏతో ఫోన్ చేయించి తనను వెనక్కిపంపించారని చెప్పారు. అదే మోదీ అపాయింట్మెంట్ ఇస్తే .. తన కోసం డోర్ వద్ద ఎదురు చూస్తూ నిలుచున్నారని, అది చూసి వెంటనే ఆయనకు మొక్కాలనిపించిందని ఆర్కేకు వివరించారు. ఇక్కడే దేశ అధినేతగా ఉన్న మోదీకి, జగన్ రెడ్డికి మధ్య ఉన్న సంస్కార వ్యత్యాసం అర్థమౌతోందని చెప్పారు.
బూతులు తిడుతుంటే జగన్ ఆనందపడుతుంటాడు ..!
ఎమ్మెల్యేలు, ఎంపీలు బూతులు మాట్లాడుతుంటే జగన్ రెడ్డికి ఆనందపడుంటాడని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. మద్యపాన నిషేదం చేస్తానన్న సీఎం జగన్ .. ఆ ఆదాయాన్ని చూపి, రుణం పొందారని పార్లమెంట్ లో చెప్తుండగా … వెనక నుంచి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తనను పట్టకుని, కనీసం చట్టసభలో ఉన్నామన్న జ్ఞానం లేకుండా లం .. నా .. కొ.. కా అని బూతులు తిట్టారని రఘురామ వాపోయ్యారు. అలానే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తనను లుచ్ఛా అని తిట్టారని చెప్పారు. ఇలా తనను తిడుతుంటే జగన్ రెడ్డి ఆనందపడుతారని ఎంపీ విచారం వ్యక్తం చేశారు.
జగన్ కు జ్ఞానం కలగాలనే .. నా రచ్చబండ!
రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని జగన్ రెడ్డి కొల్పోయ్యారని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను జగన్ రెడ్డి గాలికొదిలేస్తే .. వారి సమస్యలను తాను రచ్చబండ ద్వారా వింటున్నానని చెప్పారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజలకు వారి గోడును సోషల్ మీడియోలో నిర్వహించే రచ్చబండ వేదికతో తనతో పంచుకుంటారని ఆర్కేతో రఘురామ చెప్పారు. జగన్ రచ్చబండ ద్వారా ప్రజ సమస్యలను తెలుసుకోవాలని అనుకున్నారని, కానీ ఆ మాటను నిలపెట్టుకోలేదని, అందుకే తాను రచ్చబండను నిర్వహించి.. ప్రజా సమస్యలను నెరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నానని ఎంపీ రఘురామ చెప్పారు.