నన్ను కొడుతుంటే .. లైవ్ లో పైశాచికానందం పొందారు…!
నర్సాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తే .. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బయటకొచ్చిన పచ్చి నిజం.. దేశ వ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదే విషయాన్ని నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో ఎంపీ రఘురామ ఒప్పుకున్నారు. తాను ఒక పార్లమెంటేరియన్ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేసి తీసుకెళ్లారని వాపోయ్యారు. అంతేకాక తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుండగా .. ఒక పోలీసు అధికారి దానిని సెల్ ఫోన్ లో లైవ్ పెట్టి చూపించాడని అవేదన వ్యక్తం చేశారు. లైవ్ చూస్తున్న వ్యక్తి .. నేను ఆర్తనాధాలు చేస్తుంటే.. స్పైడర్ మెన్ సినిమాలో విలన్ మాదిరిగా పైశాచికానందాన్ని పొందాడని విచారం వ్యక్తం చేశారు రఘురామ. నన్ను పోలీసులు కొడుతుంటే .. లైవ్ పెట్టిన ఆ పోలీసు అధికారిని, లైవ్ లో ఆనందం పొందిన ఆ ప్రముఖ వ్యక్తిని జీవితంలో మర్చిపోనని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ముఖాముఖిలో ఎంపీ రఘురామ తన వేదనను ఇలా వెల్లబుచ్చారు.
జగన్ రెడ్డిది ఒక అపరిచితుడు క్యారెక్టర్ .. !
జగన్ పబ్లిక్ లో రామాచారి క్యారెక్ట్ లో ఉండి శాంతి స్వరూపుడిలా కనిపిస్తాడు .. పార్టీ కేడర్ వద్దకు వచ్చే సరికి జూలు విదిలించుకుని అపరితుడి క్యారెక్ట్ ల్లో దర్శనమిస్తాడని ఓపెన్ హార్ట్ విత్ కార్యక్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. మరి జగన్ గురించి అంత తెలిసి.. మరి మీరు జగన్ తో ఎందుకు జత కట్టారు? అని ఆర్కే రఘురామ ను ప్రశ్నించారు! దీనికి ఎంపీ బదులిస్తూ .. జగన్ మారాడమోనని భ్రమపడ్డాను.. పాదయాత్రలో చీమిడి ముక్కుతో ఉన్న పిల్లలను కూడా ముద్దాడుతూ జగన్ ప్రేమ ఒలకపోస్తుంటే … అది చూసి మారాడేమోనని నమ్మాను. అదంతా నటన అని తరువాత అనుభవంలోకి వచ్చిన తరువాత తెలుసుకున్నాని రఘురామ బదులిచ్చారు. జగన్ ను నమ్మి జీవితంలో పడరాని పాట్లు, పరాభవాన్ని చవిచూశానన్నారు. నేను జగన్ ను నమ్మడానికి మరో కారణం కూడా ఉంది.. అది ప్రశాంత్ కిషోరే నని చెప్పారు. నన్ను బ్రతిమిలాడి మరి జగన్ మారాడు .. ఒకసారి కలవండి, ఈ సారికి చూడండి అని చెప్పాడు. కాబట్టే ఆయనతో కలిసి నడిచానని ఎంపీ రఘురామ ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు.