టాలీవుడ్ పరిశ్రమ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ సంక్షోభంలో పడింది. దీని ధాటికి పెద్ద సినిమాలన్నీ షూటింగ్స్ బంద్ చేసేశాయి. విడుదల తేదీలు లాక్ అయిన సినిమాలన్నీ .. విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. అలాగే.. వకీల్ సాబ్ తర్వాత విడుదల కావాల్సిన లవ్ స్టోరీ, ఇష్క్, టక్ జగదీష్ , విరాటపర్వం సినిమాలన్నీ వరుసగా వెనక్కి తగ్గాయి. ఇక ఇప్పుడు మే నెల వంతు వచ్చింది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ , వెంకీ ‘నారప్ప’ సినిమాలు రేసులోంచి తప్పుకోగా.. ఆ తర్వాత విడుదల కావాల్సిన రవితేజ ‘ఖిలాడీ’ మూవీ కూడా విడుదల వాయిదా వేసుకుంది. ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని తెలియచేశారు.
ఇక ఇప్పుడు అదే డేట్లో షెడ్యూల్ అయిన బాలయ్య ‘అఖండ’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నెల28న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కి ఇప్పటికే బోలెడన్ని బ్రేకులు పడ్డాయి. ఒకవేళ రెస్యూమ్ అయినా.. అనుకున్న తేదీకి విడుదలయ్యే ఛాన్సెస్ లేవని అంటున్నారు. మరో పక్క థియేటర్స్ కూడా తెరిచిలేవు కాబట్టి.. ‘అఖండ’ సినిమా విడదల వాయిదా కూడా లాంఛనమే అంటున్నారు. సో.. అఖండ విడుదల కూడా వాయిదా పడక తప్పదు. నిర్మాతలు ఆ విషయాన్ని ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాలి.











