టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ వచ్చింది.. నాలుగు వారాల పాటు ఆయనకు చికిత్స చేసుకోవచ్చని బెయిల్ దక్కింది.. అయితే, చంద్రబాబుకి బెయిల్ వచ్చిందో లేదో ఆయన తనయుడు, రాజకీయ వారసుడు లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. జైలు నుండి చంద్రబాబు ఇంటికి వచ్చే వరకు అక్కడే ఉన్న లోకేష్, ఆ వెంటనే హస్తిన బాట పట్టడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతోంది..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ సర్కార్ బనాయించిన అనేక కేసులు కీలక దశలో ఉన్నాయి.. చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం దక్కింది తాత్కాలిక ఊరట మాత్రమే.. పూర్తి స్థాయిలో కేసు క్వాష్ చేయలేదు.. నేడో రేపో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటీషన్‌లో తీర్పు వెలువడనుంది.. ఇప్పటికే ఈ కేసులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేయబడింది.. ఈ నెల 8, 9వ తేదీ లేదంటే అంతకు ఒకటీ రెండు రోజుల్లో తీర్పు రానుందనే ప్రచారం జరుగుతోంది.. ప్రత్యక్ష వాదనలు ముగిసినా, న్యాయవాదులు తమ వాదనను లిఖిత పూర్వకంగా సమర్పించుకునే అవకాశం ఉంది.. అందుకే, లోకేష్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం..
మరోవైపు, లోకేష్ హస్తిన పర్యటనపై ఏపీ ఇంటెలిజెన్స్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీలో లోకేష్ ఎవరిని కలుస్తున్నారు.?? ఎవరితో భేటీ అవుతున్నారు..? ఎవరెవరు వచ్చి ఆయనతో మంతనాలు జరుపుతున్నారనే అంశాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో లోకేష్.. అమిత్ షాతో భేటీ అయ్యారు. మరోసారి ఆయన అమిత్ షాతో భేటీ అవుతారా.?? లేక కాంగ్రెస్ నేతలతో టీడీపీ అధిష్టానం మంతనాలు జరపనుందా..?. అనే అంశాలపైనా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది..
గత కొంతకాలంగా కొందరు వైసీపీ నేతలు లోకేష్‌తో టచ్‌లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.. వారంతా ఏపీ, హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో టీడీపీ యువనేతతో భేటీ అవుతున్నారని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.. అందుకే, జగన్.. లోకేష్ ఢిల్లీ టూర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారట.. మరి, ఏం జరగనుందో చూడాలి..