Pushpa Movie Release Date Confirmed After KGF2 Postponed Their Release :
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న పుష్ప చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్ ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అదే క్రిస్మస్ కి కేజీఎప్ 2 కూడా రావాలి అనుకుంది. దీంతో క్రిస్మస్ కి రాకీభాయ్ కేజీఎఫ్ 2, స్టైలీష్ స్టార్ పుష్ప సినిమాలు పోటీపడనున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. క్రిస్మస్ కి బాక్సాఫీస్ దగ్గర వార్ ఖాయం అనుకున్నారు.
అయితే.. కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ మార్చుకుంది. రీసెంట్ గా కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించింది. దీంతో పుష్ప సినిమాకి పోటీలేకపోవడంతో ఖచ్చితంగా క్రిస్మస్ కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ మిగిలివుంది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త వచ్చింది. అది ఏంటంటే.. మేకర్స్ డిసెంబర్ 24న కానీ అంతకు ముందు వారంలో గాని పుష్ప మూవీని రిలీజ్ చేయనున్నారని తెలిసింది.
Pushpa Movie Release Date
క్రిస్మస్ రేస్ అన్నారు కాబట్టి డిసెంబర్ 24నే రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం.. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. పుష్ప సినిమాతో బన్నీ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Must Read ;- చిరంజీవి తర్వాత మెగాస్టార్ అంటే.. అల్లు అర్జునే. వైరల్ గా మారి వర్మ ట్వీట్.