ఆర్ఆర్ఆర్.. దేశంలో ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. రోజురోజుకూ ఈ సినిమా ఎలా ఉండబోతోంది.? అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్.. వీరిద్దరి పాత్రలను ఎలా చూపించబోతున్నారు? ఈ సినిమా ద్వారా దర్శకధీరుడు రాజమౌళి ఏం చెప్పబోతున్నారు..? ఇలా అనేక ప్రశ్నలు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆర్ఆర్ఆర్ పై ప్రేక్షకాభిమానుల్లో ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. రాజమౌళి రీసెంట్ గా కపిల్ దేవ్ వచ్చిన ఒక ఛారిటీ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఆ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ…ఆర్ ఆర్ ఆర్ మూవీలోని ఒక డైలాగ్ ను చెప్పారు. అది ఏంటంటే.. ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి.. అది ధర్మయుద్ధమైతేనే..’ అనేదే ఆ డైలాగ్. రాజమౌళి చాలా సాధారణంగా ఈ డైలాగ్ చెప్పినప్పటికీ ఇది చాలా పవర్ ఫుల్ డైలాగ్. డెప్త్ ఉన్న డైలాగ్ అనే విషయం అర్థమవుతూనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ దేశభక్తి నేపథ్యంలో.. అల్లూరి సీతారామరాజు – కొమరం భీమ్ పోరాటయోధుల చుట్టూ తిరిగే కథ.
ఇంకా చెప్పాలంటే… ఆత్మవిశ్వాసంతో ఆంగ్లేయులను ఎదిరించిన కథ. అందువల్ల రాజమౌళి చెప్పిన డైలాగ్ ఈ కథకు కరెక్టుగా సరిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఈ సినిమాలో ఆ డైలాగ్ ను ఎన్టీఆర్, చరణ్ లలో ఇద్దరిలో తెర పై ఎవరు చెప్పారు అనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబరులో ఈ క్రేజీ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అప్పుడైనా ఈ డైలాగ్ ఎవరు చెప్పారో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
మొత్తానికి ఈ విధంగా స్వయంగా రాజమౌళి నోటి నుంచే ఆర్ఆర్ఆర్ పవర్ ఫుల్ డైలాగ్ బయటకు వచ్చింది. అదీ.. సంగతి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ‘దోస్తీ’ పల్లవితో ఓ పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్ర మరో పాట విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో ఉండే ఫోస్టర్ ఇది. ఈ పాట ఎలా ఉండబోతోందో ఈ సాయంత్రం 4 గంటలకు తెలిసిపోతుంది.











